Nani: నానీకి ఉన్న క్రేజ్ అలాంటిది మరి!

  • 'శ్యామ్ సింగ రాయ్'తో సూపర్ హిట్ 
  • రిలీజ్ దిశగా 'అంటే .. సుందరానికీ'
  • సెట్స్  పైకి వెళ్లిన 'దసరా'
  • దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల
Dasara movie upadate

చాలా కాలంగా నాని సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అలాంటి హిట్ ఆయనకి 'శ్యామ్ సింగ రాయ్' సినిమాతో పడింది. ఈ సినిమా ఆయనకి హిట్ తో పాటు ప్రశంసలను కూడా తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఆయన 'అంటే .. సుందరానికీ' సినిమా చేశాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఆ తరువాత సినిమాగా నాని 'దసరా' చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమా నుంచి వదిలిన నాని ఫస్టులుక్, అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తోంది. ఊరమాస్ లుక్ తో కనిపిస్తూ, అందరిలో అమాంతంగా ఆసక్తిని పెంచేశాడు. 

ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయని అంటున్నారు. డిజిటల్ .. శాటిలైట్ .. డబ్బింగ్ అన్ని హక్కులు కలుపుకుని, 45 కోట్లు పలికినట్టుగా చెబుతున్నారు. నాని సినిమాకి నాన్ థియేట్రికల్ హక్కులు ఈ స్థాయిలో పలకడం ఇదే మొదటిసారి అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

More Telugu News