Varun Tej: అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా 'గని' ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • 'గని'గా వరుణ్ తేజ్ 
  • బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ 
  • ఐటమ్ సాంగులో మెరవనున్న తమన్నా
  • ఏప్రిల్ 2న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • అదే నెల 8వ తేదీన సినిమా విడుదల     
Ghani movie update

వరుణ్ తేజ్ హీరోగా 'గని' సినిమా రూపొందింది. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. బాక్సింగ్ నేపథ్యంతో ముడిపడిన ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ సినిమా నిర్మితమైంది. ఈ సినిమాతో సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి కథానాయికగా పరిచయం కానుంది.

తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఏప్రిల్ 8వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఏప్రిల్ 2వ తేదీన వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

 కొంతసేపటి క్రితమే అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. జగపతిబాబు .. సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నదియా .. నవీన్ చంద్ర ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, తమన్నా స్పెషల్ సాంగ్ హైలైట్ గా నిలవనుంది. చాలా గ్యాప్ తరువాత వరుణ్ తేజ్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి మరి.

More Telugu News