Allu Arjun: ఇటు బన్నీని .. అటు ధనుశ్ ని రంగంలోకి దింపుతున్న కొరటాల?

  • దర్శకుడిగా కొరటాలకి మంచి క్రేజ్ 
  • మహేశ్ బాబుకి రెండు భారీ హిట్లు
  • ఎన్టీఆర్ తో రెండో సినిమాకి సన్నాహాలు
  •  మల్టీ స్టారర్ చేసే ఆలోచన 
Allu Arjun in Koratala movie

కొరటాల మంచి రచయిత .. ఎన్నో విజయవంతమైన సినిమాలకు రచయితగా ఆయన పనిచేశారు. ఆ తరువాత 'మిర్చి' సినిమాతో మెగాఫోన్ పట్టుకున్న ఆయన, అప్పటి నుంచి ఒకదానికి మించిన హిట్ ఒకటి అందిస్తూ వెళుతున్నారు. మహేశ్ బాబుకి 'శ్రీమంతుడు'తో హిట్ ఇచ్చిన ఆయన, ఆ తరువాత 'భరత్ అనే నేను'తో మరో హిట్ కొట్టారు. 

అలాగే ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' చేసిన ఆయన, ఇప్పుడు ఆయనతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా తరువాత ఏ హీరోతో కొరటాల సినిమా ఉండొచ్చు అనే ప్రశ్నకి సమాధానంగా బన్నీ -  ధనుశ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే బన్నీతో ఇటు తెలుగులో .. ధనుశ్ తో అటు తమిళంలో చేయడం లేదు. 

 ఈ ఇద్దరితో ఒక మల్టీ స్టారర్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. అందుకు సంబంధించిన కథ ఆయన దగ్గర ఆల్రెడీ ఉందని చెబుతున్నారు. ధనుశ్ ఇక్కడి వారికి బాగా తెలుసు. బన్నీకి తమిళంలోను మంచి క్రేజ్ ఉంది. అందువలన ఈ ఇద్దరితో కలిసి ద్విభాషా చిత్రం చేయనున్నారనే టాక్ బలంగానే వినిపిస్తోంది.   

More Telugu News