RRR: 'ఆర్ఆర్ఆర్' దెబ్బకు బద్దలవుతున్న బాక్సాఫీస్ రికార్డులు.. ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందంటే..!

  • సంచలనాలను నమోదు చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'
  • అన్ని రాష్ట్రాల్లో ఫుల్ అవుతున్న థియేటర్లు
  • ఇప్పటి వరకు రూ. 500 కోట్లను అధిగమించిన కలెక్షన్లు
RRR collections crosses Rs 500 Cr

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ సినిమా దెబ్బకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలవుతున్నాయి. విడుదలైన తొలి షోకే ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో... ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా అన్ని చోట్లా థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయి. 

నిన్నటి వరకు ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ వివరాలను ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించారు. ఈ రోజు కూడా అదే ఊపు కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇండియన్ సినిమాకు ఈ చిత్రం మరింత ఖ్యాతిని తీసుకొచ్చిందని కొనియాడారు. కరోనా సమయంలో, సెలవులు లేని రోజుల్లో రిలీజైనా... 'ఆర్ఆర్ఆర్' తిరుగులేని విధంగా దూసుకుపోతోందని అన్నారు.

More Telugu News