Varun Tej: వరుణ్ తేజ్ కొత్త సినిమా ప్రారంభం!

  • రిలీజ్ కి రెడీ అయిన 'గని'
  • ముగింపు దశలో 'ఎఫ్ 3'
  • పట్టాలపైకి 12వ సినిమా
  • సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్
Varun Tej New Movie launched

వరుణ్ తేజ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'గని' రెడీ అవుతోంది. వచ్చేనెల 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి 'ఎఫ్ 3' రానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా ఈ ఏడాది లోనే థియేటర్లకు రానుంది. 

ఈ నేపథ్యంలో ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 12వ సినిమా. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. నాగబాబు క్లాప్ ఇవ్వగా .. ఆయన భార్య కెమెరా స్విచ్చాన్ చేయగా ముహూర్తపు షాట్ ను చిత్రీకరించారు. నాగబాబు ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. 

బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. కథానాయికలు ఎవరు? ఎంతమంది? అనే విషయాలతో పాటు మిగతా వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. నాగ్ తో 'ది ఘోస్ట్' షూటింగు పూర్తికాగానే, ప్రవీణ్ సత్తారు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టనున్నాడు.

More Telugu News