KGF-2: కేజీఎఫ్-2 ట్రైలర్ ను విడుదల చేసిన బర్త్ డే బాయ్ రామ్ చరణ్

  • యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చిత్రం
  • గతంలో ఇదే కాంబోలో వచ్చిన కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్
  • సీక్వెల్ పైనా భారీ అంచనాలు
  • ఆల్ ది బెస్ట్ చెప్పిన రామ్ చరణ్
Birthday Boy Ram Charan launches KGF sequel trailer

టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్ చేతులు మీదుగా నేడు కేజీఎఫ్-2 ట్రైలర్ విడుదలైంది. కన్నడ హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ కు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, కేజీఎఫ్-2 ట్రైలర్ వీడియోను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రామ్ చరణ్... ఈ చిత్రంపై స్పందిస్తూ, తర్వాత వచ్చే పెను తుపాను ఇదేనంటూ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. హీరో యశ్ కు, దర్శకుడు ప్రశాంత్ నీల్ లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. కేజీఎఫ్ చాప్టర్-2 కోసం ఎదురుచూస్తున్నానంటూ ట్వీట్ చేశారు. 

కాగా, ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, మాళవికా అవినాష్, అయ్యప్ప పి శర్మ, రావు రమేశ్, ఈశ్వరీ రావు తదితరులు నటించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై కేజీఎఫ్-2 చిత్రాన్ని విజయ్ కిరంగదూర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, వారాహి చలన చిత్రం సంస్థ సమర్పిస్తుండడం విశేషం.

More Telugu News