RRR: రెండో రోజు కూడా భారీగా వ‌సూళ్లు రాబ‌ట్టి ఆర్ఆర్ఆర్ రికార్డు!

  • మొన్న హిందీలో తొలిరోజు రూ.18 కోట్లు 
  • నిన్న‌ మ‌రింత దూసుకెళ్లి రూ.24 కోట్లు
  • రెండో రోజు ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా రూ.107-137 కోట్ల మ‌ధ్య‌ గ్రాస్‌
  • నేడు ఆదివారం కావ‌డంతో క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం
RRR Movie Collections secong day

ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందించిన‌ 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా రికార్డుల సునామీ రెండో రోజు కూడా కొన‌సాగింది. తొలి రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.223 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన విష‌యం తెలిసిందే. మొన్న హిందీలో తొలిరోజు రూ.18 కోట్లు రాబట్టిన ఆర్ఆర్ఆర్ సినిమా రెండో రోజు మ‌రింత దూసుకెళ్లి రూ.24 కోట్ల క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. 

నేడు ఆదివారం కావ‌డంతో క‌లెక్ష‌న్లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. రెండో రోజు 'ఆర్ఆర్ఆర్' ప్రపంచ వ్యాప్తంగా రూ.107-137 కోట్ల మ‌ధ్య‌ గ్రాస్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లో ఈ సినిమా  దాదాపు రూ.350 కోట్లకు పైగా రాబ‌ట్టింది.  

'బాహుబలి 2' రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ 'ఆర్ఆర్ఆర్' సినిమా దూసుకుపోతుండ‌డంతో ఆ సినిమా దేశ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించే చిత్రంగా నిలిచే అవ‌కాశాలు ఉన్నాయి. హిందీలోనూ తెలుగు సినిమా స‌త్తాను ఆర్ఆర్ఆర్ ద్వారా రాజ‌మౌళి మ‌రోసారి చాటారు.

More Telugu News