Joe Biden: పోలండ్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు.. పుతిన్ పై విమర్శలు

  • వార్సా చేరుకున్న‌ బైడెన్‌
  • పోలండ్ అధ్య‌క్షుడితో భేటీ
  • నాటోను చీల్చేందుకు య‌త్నించిన ర‌ష్యా
  • అందులో పుతిన్ విఫ‌ల‌మ‌య్యార‌న్న బైడెన్‌
america joe biden allegations on russian president putin

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ యుద్ధ ప్రాంత స‌మీపంలోకి చేరుకున్నారు. ర‌ష్యా బాంబుల దాడుల‌తో ద‌ద్ద‌రిల్లుతున్న ఉక్రెయిన్ పొరుగు దేశం పోలండ్ రాజ‌ధాని వార్సాలో బైడెన్ ఉన్నారు. శ‌నివారం వార్సా వ‌చ్చిన బైడెన్‌.. అక్క‌డ పోలండ్ అధ్య‌క్షుడు ఆండ్రెజ్ డుడాతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌, ర‌ష్యాల మ‌ధ్య సాగుతున్న యుద్ధం, తాజా ప‌రిస్థితులు త‌దిత‌రాల‌పై ఇరు దేశాల నేత‌లు చ‌ర్చించారు.

ఇదిలా ఉంటే.. ఈ వేదికగా ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై బైడెన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప‌లు దేశాల కూట‌మిగా ఉన్న నాటోను చీల్చే దిశ‌గా పుతిన్ చాలా య‌త్నాలే చేశార‌ని ఆరోపించిన బైడెన్‌.. అందులో పుతిన్ ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధం నేప‌థ్యంలో నాటో కూట‌మి ఉక్రెయిన్‌కు బాస‌ట‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన బైడెన్‌.. ఉక్రెయిన్‌ను ఏకాకిగా చేసేందుకు పుతిన్ నాటోనే చీల్చేందుకు య‌త్నించి బొక్క‌బోర్లా ప‌డ్డార‌ని బైడెన్ వ్యాఖ్యానించారు.

More Telugu News