Jr NTR: బాబుల‌కే బాబు తార‌క్ బాబు.. కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల వినూత్న నినాదాలు

  • హిట్ టాక్‌తో న‌డుస్తున్న ఆర్ఆర్ఆర్‌
  • కుప్పంలో తార‌క్ ఫ్యాన్స్ సంద‌డి
  • కొత్త జెండాతో పాటు స‌రికొత్త నినాదాలు
tarak fans josh in kuppam

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పంలో టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు ఓ రేంజిలో ఫాలోయింగ్ పెరుగుతోంది. తాజాగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని కుప్పంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్ర‌త్యేక జెండాను ఆవిష్క‌రించారు. స‌రికొత్త నినాదాల‌నూ వినిపించారు.

కుప్పం పట్టణం గుడ్ల నాయన పల్లి గ్రామ పంచాయతీ ప‌రిధిలోని ఊరినాయనపల్లి గ్రామంలో ఎన్టీఆర్‌ అభిమానులు కొత్త జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారంతా బాబులకే బాబు.. తారక్ బాబు,  కాబోయే ముఖ్యమంత్రి తారక్ బాబు.. అంటూ వినూత్న రీతిలో నినాదాలు చేశారు. అలాగే తారక్ అభిమానులు ఆయన ఫొటోలు చేతబట్టి గ్రామమంతా సందడి చేశారు. గ్రామంలో ఎక్కడ చూసినా ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలతో పండుగ వాతావరణం నెలకొంది.

More Telugu News