RRR: తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రికార్డులు అన్నింటినీ బ‌ద్దలుకొట్టిన 'ఆర్ఆర్ఆర్'

  • 'బాహుబలి 2' రికార్డే కాకుండా ఇత‌ర సినిమాల‌న్నింటి రికార్డులు బ‌ద్దలు
  • తెలుగు రాష్ట్రాల్లో రూ.70 కోట్లకు పైగా వ‌సూళ్లు 
  • నైజాంలో ఏకంగా రూ. 23.35 కోట్లు 
  • నైజాంలో ఇటీవ‌ల‌ భీమ్లా నాయక్ సినిమాకు రూ.11.85 కోట్లు
rrr sets records

జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి యంగ్ హీరోలతో ద‌ర్శ‌కుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా తొలి రోజు 'బాహుబలి 2' రికార్డునే కాకుండా, ఆ సినిమా త‌ర్వాత వ‌చ్చిన చిత్రాల రికార్డునూ బ‌ద్ద‌లు కొట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ సినిమాకు వ‌చ్చిన వ‌సూళ్లు మామూలుగా లేవు. తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ.70 కోట్లకు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో తొలిరోజు వ‌సూళ్లు సాధించిన సినిమా మ‌రొక‌టి లేదు. 

నైజాంలో ఏకంగా రూ. 23.35 కోట్లు వసూలు చేసింది. నైజాంలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ భీమ్లా నాయక్ సినిమాకు రూ.11.85 కోట్లు, అల్లు అర్జున్ పుష్ప సినిమాకు రూ.11.44 కోట్లు, ప్ర‌భాస్ రాధేశ్యామ్ మూవీకి రూ.10.80 కోట్లు, ప్ర‌భాస్ సాహో చిత్రానికి రూ. 9.41 కోట్లు, బాహుబలి 2 సినిమాకు రూ. 8.9 కోట్లు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ వకీల్ సాబ్ మూవీకి రూ.8.75 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. మరోపక్క, భార‌త దేశ చ‌రిత్ర‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించే చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు సెట్ చేస్తుంద‌న్న విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

More Telugu News