RRR: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, అమెరికాలో 'ఆర్ఆర్ఆర్' రికార్డుల సునామీ షురూ

  • ఆస్ట్రేలియాలో 'ది బ్యాట్‌మ‌న్' రికార్డుల బ‌ద్ద‌లు
  • నిన్న‌ ఆస్ట్రేలియాలో ఆర్ఆర్ఆర్ రూ.4.03 కోట్ల వ‌సూళ్లు 
  • న్యూజిలాండ్‌లో రూ.37.07 ల‌క్ష‌లు 
  • అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 5 మిలియ‌న్ డాల‌ర్ల‌ వ‌సూళ్లు
RRR OPENS TO RECORD NUMBERS IN AUS NZ

నిన్న విడుద‌లైన ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డుల సునామీని ప్రారంభించింది. ఆస్ట్రేలియాలో ఈ నెల తొలివారంలో విడుద‌లైన‌ 'ది బ్యాట్‌మ‌న్' సినిమా రికార్డుల‌ను తొలి రోజు 'ఆర్ఆర్ఆర్' బ‌ద్ద‌లు కొట్టింది. తొలి రోజు ప‌రంగా వ‌సూళ్ల విష‌యంలో 'ఆర్ఆర్ఆర్' నంబ‌ర్ 1 స్థానంలో నిలిచింది. 

ఆస్ట్రేలియాలో రూ.4.03 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా, న్యూజిలాండ్‌లో రూ.37.07 ల‌క్ష‌లు రాబ‌ట్టింది. ఇక అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు 5 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు వచ్చాయి. ఈ విష‌యాల‌ను వివ‌రిస్తూ బాలీవుడ్ సినీ విమ‌ర్శ‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్వీట్ చేశారు.  

          

More Telugu News