Prabhas: 'సలార్' రిలీజ్ అయ్యేది అప్పుడే .. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

  • ప్రభాస్ తాజా చిత్రంగా 'సలార్'
  • 30 శాతం చిత్రీకరణ పూర్తి 
  • మే నుంచి  తదుపరి షెడ్యూల్ 
  • వచ్చే వేసవిలో విడుదల
Salaar Movie

ప్రభాస్ హీరోగా 'సలార్' రూపొందుతోంది. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ను ప్రశాంత్ నీల్ మాస్ యాక్షన్ హీరోగా చూపించనున్నాడు.
 
ప్రభాస్ 'రాధేశ్యామ్'పై  పూర్తి దృష్టి పెట్టడం .. 'ఆది పురుష్'ను ముందుగా పూర్తి చేయాలనుకోవడం వలన, 'సలార్' షూటింగు ఆలస్యంగా జరుగుతూ వచ్చింది. అసలు ఈ సినిమా ఏ స్టేజ్ లో ఉందనేది ఎవరికీ తెలియడం లేదు. అందుకు సంబంధించిన అప్ డేట్స్ రావడం లేదు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నిర్మాత మాట్లాడుతూ, "ఇంతవరకూ ఈ సినిమా 30 శాతం చిత్రీకరణను జరుపుకుంది. మే నుంచి తదుపరి షెడ్యూల్ షూటింగు మొదలవుతుంది. వచ్చే వేసవిలో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నాము" అని చెప్పుకొచ్చారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.

More Telugu News