Nithin: నితిన్ ఫస్టు లుక్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు!

  • నితిన్ తాజా చిత్రంగా 'మాచర్ల నియోజకవర్గం'
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ 
  • దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి 
  • కథానాయికలుగా కృతి శెట్టి - కేథరిన్
Macharla Niyojakavargam movie update

నితిన్ హీరోగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందుతోంది. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో అవినీతి రాజకీయాల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ సిద్ధార్థ రెడ్డిగా కనిపించనున్నాడని అంటున్నారు. 

కథా నేపథ్యానికి తగినట్టుగా, ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసే తరహాలో ఈ సినిమా నుంచి ఒక ప్రకటనను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్టు అప్ డేట్ ను ఈ నెల 26వ తేదీ 10:08 నిమిషాలకి రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. బహుశా ఆ రోజున నితిన్ ఫస్టులుక్ పోస్టర్ ను వదలనున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో నితిన్ సరసన నాయికలుగా కృతి శెట్టి - కేథరిన్ కనిపించనున్నారు. ఈ సినిమాకి మహతి స్వరసాగర్  సంగీతాన్ని అందించాడు. 'భీష్మ' తరువాత నితిన్ చేసిన మూడు సినిమాలు పరాజయాల జాబితాలో చేరిపోయాయి.  దాంతో ఆయన ఈ సినిమాపైనే  ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ఆయన నమ్మకాన్ని నిలబెడుతుందేమో చూడాలి.

More Telugu News