Junior NTR: చరణ్ కి రెండు మార్కులు ఎక్కువిస్తాను: రచయిత విజయేంద్ర ప్రసాద్

  • ఈ నెల 25వ తేదీన 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ 
  • ప్రమోషన్స్ లో విజయేంద్ర ప్రసాద్
  • కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అదరగొట్టాడు 
  • అల్లూరి పాత్రలో చరణ్ గొప్పగా చేశాడన్న విజయేంద్ర ప్రసాద్   
RRR movie update

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్'  ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమాకి కథను అందించిన విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ .. చరణ్ ఎవరికి ఎక్కువ మార్కులు ఇస్తారనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది.

అందుకు విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ .. " అడవితల్లి  బిడ్డ కావడం వల్లనేమో ఎన్టీఆర్  పోషించిన కొమరం భీమ్ పాత్ర నాకు నచ్చింది. అడవిపూవులా ఆ పాత్ర తెరపై స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఆ పాత్రలో ఎన్టీఆర్ చాలా గొప్పగా చేశాడు. ఇక చరణ్ విషయానికి వస్తే ఒక వైపున పోరాటం .. మరో వైపున మానసిక సంఘర్షణ అనుభవించే అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తాడు. 

అల్లూరి పాత్రలో వేరియేషన్స్ .. లేయర్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ పాత్రను పోషించడం చాలా కష్టం. సినిమాలో ఎన్టీఆర్ .. చరణ్ ను అన్నా అని పిలుస్తాడు. చరణ్ పాత్రలో ఆ పరిణతి కనిపిస్తుంది. నిజానికి నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. కానీ ఈ సినిమా వరకూ నేను చరణ్ కి రెండు మార్కులు ఎక్కువిస్తాను" అని చెప్పుకొచ్చారు.

More Telugu News