RRR: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై రాజుకున్న‌ వివాదం.. క‌ర్ణాట‌క‌లో నిషేధం విధించాల‌ని పెద్ద ఎత్తున డిమాండ్

  • ఎల్లుండి విడుద‌ల అవుతున్న ఆర్ఆర్ఆర్
  • క‌న్న‌డ‌లో విడుద‌ల కావ‌ట్లేద‌ని కన్న‌డిగుల ఆగ్ర‌హం
  • ఇది త‌మ భాష‌ను అవ‌మానించ‌డ‌మేన‌ని ఆగ్ర‌హం
  • BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో..
Boycott RRR in Karnataka

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎల్లుండి విడుద‌ల అవుతున్న విష‌యం తెలిసిందే. ప‌లు భాష‌ల్లో ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో కన్నడిగులు ఈ సినిమాపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కన్నడ భాషలో విడుద‌ల అవ్వ‌ట్లేద‌ని, త‌మ భాష‌లో ఆ సినిమా విడుద‌ల కాన‌ప్పుడు ఇత‌ర భాష‌ల్లోనూ ఆడ‌కుండా క‌ర్ణాట‌క‌లో నిషేధం విధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. 

ఇటీవ‌ల కర్ణాటకలోనూ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. దీనికి క‌ర్ణాట‌క సీఎం బొమ్మై కూడా వ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ, ఈ సినిమాను కన్నడ భాషలో విడుడ‌ల చేయ‌లేక‌పోతుండ‌డంతో ఇది త‌మ భాష‌ను అవమానించడమేనని క‌ర్ణాట‌క ప్ర‌జ‌లు అంటున్నారు. ఇందుకు సంబంధించిన BoycottRRRinKarnataka హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.

More Telugu News