K Kavitha: స్కూట‌ర్‌పై వెళ్తున్న త‌ల్లీకూతుళ్ల‌ స్ఫూర్తి ఇది.. కారులో వెళ్తూ వీడియో తీసిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత‌

  • హైదరాబాద్ శివారులోని నాన‌క్ రామ్ గూడ‌లో ఘ‌ట‌న‌
  • కూతురిని స్కూట‌ర్‌పై బ‌డికి తీసుకెళుతున్న తల్లి 
  • ఆ మ‌హిళ‌తో పాటు ఆమె కూతురు తలపై కూడా హెల్మెట్
Kavitha Kalvakuntla shares a video

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఓ ఆస‌క్తిక‌ర వీడియో పోస్ట్ చేశారు. హైదరాబాద్ శివారులోని నాన‌క్ రామ్ గూడ‌లో ఓ త‌ల్లి త‌న కూతురిని స్కూట‌ర్‌పై బ‌డికి తీసుకెళుతోంది. ఆ మ‌హిళ‌తో పాటు ఆమె కూతురు కూడా హెల్మెట్ పెట్టుకుని వుంది. 

                                     
ఈ విష‌యాన్ని గుర్తించిన క‌ల్వ‌కుంట్ల క‌విత త‌న కారులోంచి ఈ వీడియో తీశారు. 'స్ఫూర్తిమంత‌మైన త‌ల్లీకూతుళ్లు.. నాన‌క్ రామ్ గూడ చౌర‌స్తా వ‌ద్ద ఈ రోజు నేను ఈ విష‌యాన్ని గ‌మ‌నించా‌ను. హెల్మెట్ పెట్టుకోండి, సుర‌క్షితంగా ఉండండి' అని క‌విత పేర్కొన్నారు.

More Telugu News