RRR: ఎల్లుండి 'ఆర్ఆర్ఆర్' విడుద‌ల‌.. అప్పుడే థియేట‌ర్ల వ‌ద్ద నానా హంగామా.. వీడియోలు ఇవిగో

  • థియేట‌ర్ల వ‌ద్ద భారీ క‌టౌట్లు
  • ప‌లు ప్రాంతాల్లో పండుగ వాతావ‌ర‌ణం
  • సినిమా క‌లెక్ష‌న్లపైనే అంద‌రి దృష్టి
rrr fans dance video

యంగ్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎల్లుండి విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే. సాధార‌ణంగా సినిమా విడుద‌ల రోజు థియేట‌ర్ల వ‌ద్ద హంగామా ఉంటుంది. అయితే, రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ విడుద‌ల‌కు ఇంకో రెండు రోజుల స‌మ‌యం ఉండ‌గానే అభిమానులు హ‌డావుడి మొద‌లు పెట్టేశారు. 

భార‌త్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ సినిమాకు సంబంధించి భారీ క‌టౌట్లు క‌న‌ప‌డుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుద‌ల వేడుక‌ను అభిమానులు పండుగ‌లా జ‌రుపుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన‌ వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ రాజ‌మౌళి, తార‌క్, చెర్రీ బిజీగా ఉంటున్నారు. ఈ సినిమాలో చెర్రీ అల్లూరిగా, తార‌క్ కొమురం భీమ్‌గా న‌టించారు.
బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా క‌లెక్ష‌న్లపైనే ప్ర‌స్తుతం అంద‌రి దృష్టి నెల‌కొంది. 

More Telugu News