Stephen Fleming: వేలంలో వారిని కోల్పోయినా.. హ్యాపీగానే ఉన్న సీఎస్కే

  • కొందరిని నష్టపోవడం బాధ కలిగించేదే
  • కానీ మంచి ప్రతిభ కలిగిన వారిని దక్కించుకున్నాం
  • అందులోనూ చాలా తక్కువ ధరకే
  • వేలం మంచి ఫలితాలనే ఇచ్చింది
  • వెల్లడించిన సీఎస్కే హెడ్ కోచ్ ఫ్లెమింగ్
We lost a couple of players Stephen Fleming

చెన్నై సూపర్ కింగ్స్ 2021 ఐపీఎల్ విజేత. కానీ రెండు కొత్త జట్ల చేరికతో మెగా వేలానికి వెళ్లాల్సి వచ్చింది. ఫలితం ఎంతో కాలంగా జట్టుతో ఉన్న కొందరు కీలక ప్లేయర్లను నష్టపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఫాప్ డుప్లెసిస్, శార్దూల్ ఠాకూర్ ను వేలంలో కొనుగోలు చేయలేకపోయింది. అయినా, వేలం చక్కగా కొనసాగిందని, తమ ప్రణాళిక ఫలితాన్ని ఇచ్చిందని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హెడ్ కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. సూరత్ లో సీఎస్కే జట్టు ప్రాక్టీస్ దశలో ఉంది. ఈ సందర్భంగా ఫ్లెమింగ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు.

మెగా వేలంలో సీఎస్కే మొత్తంగా 21 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ వేలంలో తాము ముగ్గురు చక్కటి ఆటగాళ్లను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకున్నట్టు స్టిఫెన్ ఫ్లెమింగ్ చెప్పారు. తాము కీలకమైన కొందరు ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయినా.. వేలం ఫలితం పట్ల సంతోషంగా ఉన్నట్టు తెలిపారు. 

‘‘కొందరు ఆటగాళ్లను నష్టపోయాం. దీని పట్ల కొంత బాధగా ఉంది. కానీ, అసలైన టాలెంట్ ను మేం సంపాదించాం. చక్కటి అనుభవం, యువ ఆటగాళ్ల మంచి సమతూకాన్ని పొందాం. వారు తక్కువ ధరకే మాకు సొంతం అయ్యారు. ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు. డెవన్  కాన్వేకు అంతర్జాతీయంగా ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది. మిచెల్ శాంటనర్ మాకు స్టాల్ వార్ట్ వంటి వాడు. ఆడమ్ మిల్నే రూపంలో మంచి పేస్ లభించింది. వీరంతా మంచి నైపుణ్యం, ప్రతిభ కలిగినవారు’’అని ఫ్లెమింగ్ వివరించారు.

More Telugu News