RRR: చిక్కబళ్లాపూర్ లో వేడుకగా 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్... ఎటు చూసినా అభిమాన సంద్రమే!

  • ఈ నెల 25న 'ఆర్ఆర్ఆర్' రిలీజ్
  • కన్నడ గడ్డపై ప్రీ రిలీజ్ వేడుక
  • ఏపీ, కర్ణాటక నుంచి పోటెత్తిన అభిమానులు
  • హాజరైన రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్
RRR Pre Release Event at Chikkaballapur

పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతున్న 'ఆర్ఆర్ఆర్' కర్ణాటక, ఏపీ సరిహద్దులోని చిక్కబళ్లాపూర్ లో ప్రీ రిలీజ్ వేడుక జరుపుకుంటోంది. 'ఆర్ఆర్ఆర్' ప్రధానంగా తెలుగు చిత్రమే అయినా, కన్నడ గడ్డపై ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అభిమాన జనాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇసుకేస్తే రాలనంతగా వేలాదిమంది అభిమానులు పోటెత్తారు. ఇటు ఏపీ నుంచి, అటు కర్ణాటక నుంచి ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు.  

కాగా, ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, కన్నడ చిత్రసీమ నుంచి సీనియర్ హీరో శివరాజ్ కుమార్, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత వెంకట్ హాజరయ్యారు. ఇటీవల హఠాన్మరణం చెందిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు ఈ కార్యక్రమంలో ఘననివాళి అర్పించారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News