Pushpa: అల్లు అర్జున్‌లాంటి 10 మంది 'పుష్ప‌'లు ఒక్క‌చోట చేరితే ఇలా ఉంటుంది.. వీడియో వైర‌ల్

  • అల్లు అర్జున్‌ 'పుష్ప' రాజ్ మేనియా ఇది
  • ప‌ది మంది ఒకేసారి పుష్ప రాజ్‌లా వేష‌ధార‌ణ‌
  • ఓ వీధిలో తిరిగిన వైనం
pushpa video go viral

అల్లు అర్జున్‌ 'పుష్ప' రాజ్ మేనియా ఇప్ప‌టికీ ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. ఈ సినిమాలోని అల్లు అర్జున్ స్టయిల్‌కి దేశ వ్యాప్తంగా ఎంత పాప్యులారిటీ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పే అవ‌స‌రం లేదు. కొంద‌రు పుష్పలా వేషాలు వేసి, బ‌న్నీలా న‌డుస్తూ వీడియోలు తీసుకుంటున్నారు. ఇలా, ప‌ది మంది ఒకేసారి పుష్ప రాజ్‌లా వేష‌ధార‌ణ‌తో ఓ వీధిలో తిరిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. 

సినిమాల ప్ర‌భావం ఏ మేర‌కు ఉంటుందో చూపించేలా ఈ వీడియో ఉంది. 'త‌గ్గేదే లే' అంటూ బ‌న్నీ చెప్పిన డైలాగుల‌ను చెబుతూ వారు న‌డుచుకుంటూ వెళ్లారు. ఇటీవ‌ల ఓ వ్యాపారి పుష్ప చీర‌లు కూడా రూపొందించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు అబ్బాయిల దుస్తుల‌పై కూడా పుష్ప లోగోలు ముద్రిస్తున్నారు. పుష్ప సినిమాలోని దృశ్యాల‌ను చీర‌ల‌పై ప్రింట్ చేసి కూడా వదిలారు. 

More Telugu News