Prabhas: హిందీలో డీలాపడిన 'రాధేశ్యామ్'

  • ఈ నెల 11వ తేదీన వచ్చిన 'రాధే శ్యామ్'
  • మొదటి మూడు రోజుల్లో 151 కోట్ల గ్రాస్ 
  • వీకెండ్ తరువాత తగ్గుముఖం పట్టిన వసూళ్లు
  • 'సాహో' మార్కును కూడా అందుకోలేకపోయిన 'రాధేశ్యామ్'  
Radhe Shyam movie update

ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా 'రాధే శ్యామ్' రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో ఇదే రోజున ఈ సినిమాను విడుదల చేశారు. తొలి రోజునే ఈ సినిమా మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. హీరో  - హీరోయిన్ కి సంబంధించిన సన్నివేశాలపైనే పూర్తి ఫోకస్ పెట్టారనే విమర్శలు వచ్చాయి.

తొలి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 79 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 3 రోజుల్లో 151 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఆ తరువాత మాత్రం ఈ సినిమా జోరు తగ్గడం మొదలుపెట్టింది. గతంలో ప్రభాస్ నుంచి వచ్చిన 'బాహుబలి' .. 'బాహుబలి 2'  'సాహో' సినిమాలు హిందీలో భారీ వసూళ్లను సాధించాయి.

దాంతో ఈ సినిమా కూడా హిందీలో లాంగ్ రన్ లో 100 కోట్ల వరకూ వసూలు చేయవచ్చని అనుకున్నారు. అయితే హిందీ వెర్షన్ విషయంలో అంచనాలు మరీ తలక్రిందులయ్యాయి. లాంగ్ రన్ లో ఈ సినిమా అక్కడ 20 కోట్లకి మించి వసూలు చేయకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

More Telugu News