Prabhas: ప్రభాస్ కోసం మారుతి సెట్ చేసిన టైటిల్ అది కాదట!

  • ప్రభాస్ తో మారుతి భారీ ప్రాజక్టు 
  • ప్రచారంలో 'రాజా డీలక్స్' టైటిల్ 
  • ఆ టైటిల్ రవితేజ కోసమంటూ వార్తలు
  • త్వరలో ప్రభాస్ సినిమా టైటిల్ వెల్లడి       
Maruthi movies update

ప్రభాస్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'రాధే శ్యామ్' భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఆ తరువాత ఆయన నుంచి 'సలార్' .. 'ఆది పురుష్' రానున్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలోని 'ప్రాజెక్టు K' షెడ్యూల్స్ ను వెంటవెంటనే ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. 

ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తో మారుతి ఒక సినిమా చేయనున్నాడనీ .. ఆ సినిమా టైటిల్ 'రాజా డీలక్స్' అనే టాక్ వచ్చింది. తాను చెప్పేవరకూ వెయిట్ చేయమని మారుతి స్పందించాడు కూడా. అయితే ఇది రవితేజ కోసం మారుతి అనుకున్న టైటిల్ అనేది తాజా సమాచారం. రవితేజతో మారుతి ఈ టైటిల్ తో త్వరలో సెట్స్ పైకి వెళతాడన్న మాట.

ఇక ప్రభాస్ తో చేయనున్న సినిమా టైటిల్ ను త్వరలోనే మారుతి ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ కి సంబంధించిన ఈ సినిమాకి టైటిల్ ను సెట్ చేసే పనిలోనే ఆయన టీమ్ ఉందని చెబుతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు కథానాయికలు సందడి చేయనున్నారనే సంగతి తెలిసిందే.

More Telugu News