RRR: 'ఆర్ఆర్ఆర్' మూడు గంటల సినిమా... సెన్సార్ పనులు పూర్తి

  • ఈ నెల 25న రిలీజ్ అవుతున్న ఆర్ఆర్ఆర్
  • U/A సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు
  • సినిమా నిడివి 3 గంటల 6 నిమిషాల 54 సెకన్లు
  • రాజమౌళి దర్శకత్వంలో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా చిత్రం
RRR censor completed

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. 3 గంటల 6 నిమిషాల 54 సెకన్ల నిడివి ఉన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్, సముద్ర ఖని, శ్రియ తదితరులు నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై రూపుదిద్దుకున్న ఈ చిత్రం రూ.336 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

More Telugu News