America: అమెరికాలో మ‌రో భార‌త సంత‌తి వ్య‌క్తికి కీల‌క ప‌ద‌వి

  • వైట్ హౌస్ కోవిడ్‌-19 రెస్పాన్స్ కోఆర్డినేట‌ర్‌గా ఝా
  • క‌రోనా స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు నూత‌న విధానం
  • దానిని ప‌క్కాగా అమ‌లు చేసేందుకే ఝాకు కీల‌క ప‌ద‌వి
  • ఆశిష్ ఝాపై జో బైడెన్ కీల‌క వ్యాఖ్య‌లు
another indian amefican gets key post in white house

అమెరికా రాజ‌కీయాల‌తో పాటు ఆ దేశ పాల‌న‌లోనూ భార‌త సంత‌తి వ్య‌క్తుల‌కు క్ర‌మంగా ప్రాధాన్యం ద‌క్కుతోంది. ఇప్ప‌టికే అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా భార‌త సంత‌తికి చెందిన క‌మ‌లా హ్యారిస్ స‌త్తా చాటుతుండ‌గా.. తాజాగా అమెరికా అధ్య‌క్ష భ‌వ‌నం వైట్ హౌస్‌లో భార‌త సంత‌తికి చెందిన ఆశిష్ ఝాకు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

వైట్ హౌస్ కోవిడ్‌-19 రెస్పాన్స్ కో ఆర్డినేట‌ర్‌గా ఆశిష్ ఝాను నియ‌మిస్తూ జో బైడెన్ గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌రోనా విజృంభిస్తున్న త‌రుణంలో దానిని ఎదుర్కొనేలా రూపుదిద్దుతున్న ప‌థ‌కం, క‌రోనా నేప‌థ్యంలో త‌లెత్తే స‌వాళ్ల‌ను దీటుగా ఎదుర్కొనే కీల‌క బాధ్య‌త‌ల‌కు ఝా స‌రైన వ్య‌క్తి అని భావిస్తున్నాన‌ని బైడెన్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

More Telugu News