Allu Arjun: రాజమౌళిని లైన్లో పెడుతున్న బన్నీ!

  • 'పుష్ప'తో సంచలన విజయాన్ని అందుకున్న బన్నీ
  • 'పుష్ప 2' కోసం జరుగుతున్న సన్నాహాలు 
  • తరువాత సినిమా బోయపాటి దర్శకత్వంలో 
  • రాజమౌళితో ప్రాజెక్టు పట్ల బన్నీ ఉత్సాహం
Allu Arjun in Rajamouli movie

మొదటి నుంచి కూడా బన్నీకి చాలా ముందుచూపు ఎక్కువ. తన సినిమాల సక్సెస్ గ్రాఫ్ ఎంతమాత్రం తగ్గకుండా ఆయన ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందులో భాగంగా స్టార్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయడానికి ఉత్సాహన్ని చూపుతుంటాడు. గతంలో త్రివిక్రమ్ కోసం వెయిట్ చేసి మరీ ఆయనతో సినిమా చేసి హిట్ కొట్టాడు. 

ఇప్పుడు కూడా అలాగే ఆయన రాజమౌళిపై దృష్టి పెట్టినట్టుగా చెబుతున్నారు. 'పుష్ప'తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన బన్నీ, ప్రస్తుతం 'పుష్ప 2'తో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత సినిమాను బోయపాటి దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా రెడీగానే ఉన్నాయి. 

ఈ సినిమా తరువాతనే రాజమౌళితో ఒక సినిమా చేయడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. మహేశ్ బాబుతో సినిమాను రాజమౌళి పూర్తిచేసిన తరువాత తనతో ఆయన సినిమా ఉండేలా చూసుకుంటున్నాడని చెబుతున్నారు. ఇక రాజమౌళి ఆస్థానంలో బన్నీ కోసం కథపై కసరత్తు మొదలైనట్టే అనుకోవాలి.

More Telugu News