Junior NTR: యూఎస్ లో రికార్డు స్థాయి లొకేషన్లలో 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్!

  • రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్'
  • చరణ్ సరసన సీత పాత్రలో అలియా భట్ 
  • కీలకమైన పాత్రలో అజయ్ దేవగణ్ 
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల
RRR movie update

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన విడుదలవుతోంది. ఒక్క యూఎస్ లోనే ఈ సినిమాను 1150కి పైగా లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక భారతీయ సినిమా ఈ స్థాయి లొకేషన్స్ లో రిలీజ్ అవుతుండటం ఇదే ఫస్టు టైమ్ అనీ .. ఆ రికార్డు రాజమౌళికి దక్కిందని అంటున్నారు.

ఈ నెల 24వ తేదీ నుంచే అక్కడ షోస్ మొదలవుతాయి. ప్రపంచంలోని అతి పెద్ద స్క్రీన్ గా చెప్పుకునే యూకే లోని ఐమాక్స్ తెరపై ఈ సినిమా ప్రీమియర్ షో పడుతుండటం కూడా ఒక రికార్డుగా చెబుతున్నారు. ఇలా కథాకథనాల పరంగానే కాకుండా సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా కొత్త రికార్డులను కొల్లగొట్టడం ఖాయమని అంటున్నారు. 

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటించగా .. ఆయన మనసు దోచిన సీత పాత్రలో అలియా భట్ కనిపించనుంది. కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషించాడు. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

More Telugu News