IPL 2020: ఐపీఎల్ 2022: ఆ వెబ్‌సైట్లపై నిషేధం విధించాలంటూ హైకోర్టు ఆదేశాలు

  • స్టార్ ఇండియా పిటిషన్‌‌ను విచారించిన కోర్టు 
  • ఐపీఎల్‌ను అక్రమంగా స్ట్రీమింగ్ చేస్తున్న వెబ్‌సైట్లపై ఉక్కుపాదం
  • 8 సైట్లపై తక్షణం నిషేధం విధించాలని ఆదేశం
Plea Moved In Delhi High Court To Cancel IPL Matches In Delhi

ఈ నెల 26 నుంచి ఐపీఎల్ 2022 ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఐపీఎల్‌ను అక్రమంగా ప్రసారం చేస్తున్న వెబ్‌సైట్లపై తక్షణం నిషేధం విధించాలని ఆదేశించింది. స్టార్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

అక్రమంగా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేస్తున్న 8 వెబ్‌సైట్లను తక్షణం బ్లాక్ చేయాలంటూ కేంద్ర సమాచార, సాంకేతిక శాఖను కోర్టు ఆదేశించింది. నిషేధం విధించాలని కోర్టు ఆదేశించిన వెబ్‌సైట్లలో లైవ్.ఫిక్స్‌హబ్.నెట్, స్టిస్‌స్పోర్ట్స్.కామ్, వీఐపీలీగ్.ఐఎం, మ్యాక్స్‌ప్పోర్ట్.వన్, గూయల్.టాప్, టీ20డబ్ల్యూసీ.ఎన్ఎల్, వీఐపీస్టాండ్.సె, స్ట్రీమ్.బిటోలట్.ఆన్‌లైన్ ఉన్నాయి.

More Telugu News