Post Office: ఇకపై ఈ పోస్టాఫీస్ డిపాజిట్ల‌ వ‌డ్డీ న‌గ‌దు రూపంలో అంద‌దు!

  • మూడు స్కీంల వ‌డ్డీ చెల్లింపుల్లో మార్పు
  • వ‌డ్డీని న‌గ‌దు రూపేణా ఇవ్వ‌రాద‌ని నిర్ణ‌యం
  • సేవింగ్స్ ఖాతాల్లో జ‌మకు ప్ర‌థ‌మ‌ ప్రాధాన్యం
  • ఖాతా లేకుంటే చెక్కు రూపేణా చెల్లింపు
  • ఏప్రిల్ 1 నుంచి నూత‌న నిబంధ‌న అమ‌ల్లోకి 
the interest for three postal savings schemes will deposited in bank accounts only

చిన్న మొత్తాల పొదుపున‌కు పోస్టాఫీస్‌ను మించిన ఉత్త‌మ ప‌థ‌క‌మేదీ లేద‌నే చెప్పాలి. అతి స్వ‌ల్ప మొత్తానికి చెందిన పొదుపున‌కూ అనుమ‌తి ఇస్తున్న కార‌ణంగానే పోస్టాఫీస్ పొదుపు ఖాతాల‌కు దేశ ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంది. ఏటికేడు పోస్టాఫీస్ పొదుపు ఖాతాల సంఖ్య‌తో పాటు అందులో జ‌మ అవుతున్న జ‌నం పొదుపు సొమ్ము కూడా పెరుగుతూనే ఉంది. ఇలాంటి త‌రుణంలో త‌పాలా శాఖ ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిర్ణ‌యంతో సీనియ‌ర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్, మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌, టెర్మ్ డిపాజిట్ల‌కు సంబంధించిన వ‌డ్డీ మొత్తం న‌గ‌దు రూపేణా ఖాతాదారుల చేతికంద‌దు. ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఈ స్కీముల్లో డిపాజిట్ చేసిన మొత్తాల‌కు వ‌డ్డీ య‌థావిధిగానే ఇవ్వ‌నున్న‌ప్ప‌టికీ, ఆ వ‌డ్డీ మొత్తాన్ని న‌గ‌దు రూపేణా చేతికి ఇవ్వ‌కుండా.. వినియోగ‌దారుల పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాలో కానీ, బ్యాంక్ ఖాతాలో కానీ జ‌మ చేస్తారు. ఒక‌వేళ సీనియ‌ర్ సిటిజెన్స్‌ తమ బ్యాంకు ఖాతాను వీటితో అనుసంధానం చేసుకుని వుండకపోయినట్టయితే కనుక పోస్టాఫీస్ సేవింగ్స్ ఖాతాకు జమచేయడం కానీ, లేదా చెక్కు రూపేణా వ‌డ్డీ చెల్లించడం కానీ చేస్తారు. 

More Telugu News