Prabhas: 3 రోజుల్లో 151 కోట్లు కొల్లగొట్టిన 'రాధేశ్యామ్'

  • ఈ నెల 11న వచ్చిన 'రాధేశ్యామ్'
  • ప్రపంచ వ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల 
  • రొమాంటిక్ హీరోగా కనిపించిన ప్రభాస్ 
  • తొలిరోజు వసూళ్లు 79 కోట్ల గ్రాస్
Radhe Shyam movie update

ప్రభాస్ నుంచి ఇంతకుముందు వచ్చిన 'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాల్లో రొమాన్స్ పాళ్లు తక్కువ. ఆ తరువాత వచ్చిన 'సాహో'లో కూడా యాక్షన్ పాళ్లే ఎక్కువ. ఆయన నుంచి యాక్షన్ లేని సినిమాలను ఎవరూ ఊహించరు. కానీ అలాంటి ఒక రొమాంటిక్ కథతో 'రాధేశ్యామ్'గా ఆయన ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చాడు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమా, తొలిరోజునే 79 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వీకెండ్ పూర్తయ్యేనాటికి ఏ స్థాయి వసూళ్లను సాధిస్తుందా అని అంతా ఆసక్తితో ఉన్నారు. తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 151 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు.

అయితే ఇక ఈ రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలి. 'ఆర్ ఆర్ ఆర్' బరిలోకి దిగే వరకూ పెద్ద సినిమాలేవీ వచ్చే అవకాశం లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రభాస్ కి గల క్రేజ్ కి బలమైన కథాకథనాలు తోడై ఉంటే వసూళ్ల పరంగా ఈ సినిమా మరో లెవెల్లో ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News