Etthara Genda: 'ఎత్తర జెండా' పాట విడుదలను వాయిదా వేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

  • ఆర్ఆర్ఆర్ లో స్ఫూర్తిదాయక గీతం
  • సినిమా విడుదలకు ముందే పాటను రిలీజ్ చేస్తామన్న రాజమౌళి
  • సాంకేతిక సమస్యలతో విడుదల వాయిదా
  • రేపు విడుదల చేస్తామన్న చిత్రబృందం
RRR team postponed Etthara Genda song

భారీ తారాగణం, భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ చిత్రం నుంచి ఎత్తర జెండా అనే ఉత్తేజభరిత గీతాన్ని అభిమానుల కోసం ముందే తీసుకువస్తున్నామని ఇటీవల దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. 

ఈ పాటను వాస్తవానికి నేడు విడుదల చేయాల్సి ఉంది. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా ఎత్తర జెండా పాటను ఇవాళ విడుదల చేయలేకపోతున్నామని ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ వెల్లడించింది. ఈ పాటను రేపు (మార్చి 15) ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తామని ట్విట్టర్ లో పేర్కొంది. ఇటీవలే ఈ పాటకు సంబంధించి ప్రోమో రాగా, అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. 

కాగా, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ఇవాళ ఏపీ సీఎం జగన్ ను ఆయన నివాసంలో కలిశారు. ఈ భేటీలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కూడా పాల్గొన్నారు. మరికొన్ని రోజుల్లో ఆర్ఆర్ఆర్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

More Telugu News