Corona Virus: ఎల్లుండి నుంచి 12- 14 ఏళ్ల పిల్ల‌ల‌కూ వ్యాక్సిన్

  • 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్‌ డోసు కూడా
  • ఇప్ప‌టికే 15- 18 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్‌
  •  ఇప్పటివరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వినియోగం 
vaccinationto12 to14 years children from 16th

ప్రాణాంత‌క కరోనా వైర‌స్ బారి నుంచి ర‌క్ష‌ణ కోసం వేస్తున్న వ్యాక్సినేష‌న్‌లో కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టిదాకా పెద్ద‌ల‌కు మాత్ర‌మే వ్యాక్సిన్ వేసిన ప్ర‌భుత్వం.. ఇటీవ‌లే 15- 18 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌లకు కూడా వ్యాక్సిన్ల‌ను వేసింది. తాజాగా 12- 14 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు పిల్ల‌ల‌కు కూడా వ్యాక్సినేషన్‌కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 16 (బుధ‌వారం) నుంచే ఈ వ‌య‌సు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్లు వేయ‌నున్న‌ట్లు సోమ‌వారం కేంద్రం ప్ర‌క‌టించింది. 

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి కాసేప‌టి క్రితం జారీ అయిన ఆదేశాల ప్ర‌కారం 12-14 ఏళ్ల మధ్య పిల్లలతో పాటు 60 ఏళ్లకు పైబడిన వాళ్లకు ప్రికాషన్‌ డోసు ప్రక్రియ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మాన్షుక్‌ మాండవీయా త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దేశంలో కొన్ని నెల‌లుగా సాగుతున్న‌ వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు 1,79,91,57,486 డోసుల వ్యాక్సిన్ వేశారు.

More Telugu News