Poonam Kaur: తనను నమ్మినవాళ్ల కోసం నిలబడే వ్యక్తి ప్రభాస్: పూనమ్ కౌర్

  • ఓ యూట్యూబ్ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పూనమ్
  • ప్రభాస్ వ్యక్తిత్వంపై ప్రశంసలు
  • మంచి వ్యక్తి అని కితాబు
Poonam Kaur appreciates Prabhas character

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ నటించిన నాతిచరామి చిత్రం ఈ నెల 10న 20 ఓటీటీ వేదికల్లో విడుదలైంది. ఓటీటీ వేదికలపై నాతిచరామి చిత్రానికి విశేష స్పందన వస్తుండడంతో పూనమ్ కౌర్ ఆనందోత్సహాల్లో తేలియాడుతోంది. ఈ నేపథ్యంలో, ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు పంచుకుంది.

టాలీవుడ్ అగ్రహీరోల గురించి మాట్లాడుతూ, ఇండస్ట్రీలో స్టార్లు, యాక్టర్లు అనేకమంది ఉంటారని, కానీ ప్రభాస్ వంటి వ్యక్తి టాలీవుడ్ లో మరొకరు లేరని స్పష్టం చేసింది. ప్రభాస్ లుక్స్, క్రేజ్ కాకుండా... తనను నమ్మినవాళ్ల కోసం నిలబడడమే ఆయన క్యారెక్టర్ అని పేర్కొంది. ఒక వ్యక్తిని నమ్మి ఐదేళ్లు ఒకే సినిమాకు కేటాయించడం ప్రభాస్ కు మాత్రమే సాధ్యమని అభిప్రాయపడింది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ప్రేమ కథ కాబట్టి తాను కూడా ఇష్టపడతానని తెలిపింది. ప్రభాస్ మంచి వ్యక్తి అని కొనియాడింది.

More Telugu News