Bumrah: బెంగళూరు టెస్టులో బుమ్రా ఫైర్... శ్రీలంక 109 ఆలౌట్

  • బెంగళూరులో డే నైట్ టెస్టు
  • తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 252 ఆలౌట్
  • శ్రీలంక పనిబట్టిన బుమ్రా, షమీ, అశ్విన్
  • బుమ్రాకు 5 వికెట్లు
Bumrah gets five wickets in Bengaluru test

బెంగళూరులో జరుగుతున్న డే నైట్ టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బౌలింగ్ కు శ్రీలంక దాసోహమైంది. బుమ్రా 5 వికెట్లతో విజృంభించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోరు 86-6తో నేడు రెండో రోజు ఆట ప్రారంభించిన లంక... కాసేపట్లోనే ఇన్నింగ్స్ ముగించింది. 

నిన్న 3 వికెట్లు తీసిన బుమ్రా ఇవాళ ఆట ఆరంభంలోనే 2 వికెట్లు తీయగా, మిగిలిన రెండు వికెట్లను అశ్విన్ పడగొట్టాడు. లంక ఇన్నింగ్స్ లో ఏంజెలో మాథ్యూస్ 43 పరుగులు చేయగా, ఎంబుల్దెనియ 21 పరుగులు చేశాడు. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ కు కీలకమైన 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.

More Telugu News