Lakhimpur Kheri: ఒడిశాలో ల‌ఖింపూర్ ఖేరి త‌ర‌హా ఘ‌ట‌న‌.. 20 మందికి గాయాలు

  • ల‌ఖింపూర్ ఖేరీలో రైతుల‌పైకి కారు
  • ఒడిశాలో జ‌న స‌మూహంపై ఎమ్మెల్యే కారు
  • 20 మందికి పైగా గాయాలు
  • గాయ‌ప‌డ్డ‌వారిలో ఏడుగురు పోలీసులు
bjd mla rams his car over the crowd

నూత‌న సాగు చ‌ట్టాల ర‌ద్దు కోసం దేశ రైతులంతా ఒక్కుమ్మ‌డిగా ఉద్య‌మిస్తున్న వేళ‌.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖింపూర్ ఖేరీలో కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి అజయ్ మిశ్రా త‌న‌యుడు ఆశిష్ మిత్రా రైతుల‌పైకి త‌న కారును దూకించాడంటూ తీవ్ర ఆరోపణలు వచ్చిన సంగతి విదితమే. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు రైతులు మ‌ర‌ణించ‌డంతో కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేకెత్తాయి. 

స‌రిగ్గా అదే త‌ర‌హాలో ఇప్పుడు ఒడిశాలోనూ ఓ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌ర‌ణాలైతే సంభ‌వించ‌లేదు గానీ.. ఏడుగురు పోలీసులు స‌హా 20 మందికిపైగా తీవ్ర గాయాల‌పాలయ్యారు.

నేడు చోటుచేసుకున్న ఈ ఘ‌టన వివ‌రాల్లోకి వెళితే.. ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జ‌న‌తాద‌ళ్‌కు చెందిన ఎమ్మెల్యే ప్రశాంత్ జ‌గ‌దేవ్ ఇటీవ‌లే స‌స్పెన్ష‌న్‌కు గురయ్యారు. ఈ క్ర‌మంలో శ‌నివారం ఉద‌యం త‌న ఇంటి వ‌ద్ద‌కు భారీగా చేరుకున్న వారి మీద‌కు ఆయ‌న త‌న కారును దూకించేశారు. ఈ ఘ‌ట‌న‌లో బీజేడీకి చెందిన ఓ కార్య‌క‌ర్త స‌హా 15 మంది బీజేపీ కార్య‌క‌ర్త‌లు, ఏడుగురు పోలీసు సిబ్బంది గాయ‌ప‌డ్దారు. ఈ ఘ‌ట‌నపై విచార‌ణ‌కు ఆదేశించినట్లు ఖోర్ధా ఎస్పీ తెలిపారు.

More Telugu News