RadheShyam: ప్రభాస్ 'రాధేశ్యామ్' కు ఏపీలో నిరాశ... తెలంగాణలో ఊరట

  • ఇటీవల ఏపీలో కొత్త జీవో
  • ఏపీలో 20 శాతం షూటింగ్ జరుపుకుంటే టికెట్ రేట్లు పెంచుకునే చాన్స్
  • ఏపీలో షూటింగ్ జరుపుకోని రాధేశ్యామ్
  • అదనపు షోలకు నో చాన్స్
No extra show for Radhe Shyam in AP

ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రాధేశ్యామ్ చిత్రం రేపు (మార్చి 11) భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అయితే, రాధేశ్యామ్ చిత్రానికి ఏపీలో నిరాశాజనక పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఏపీలో ఇటీవల కొత్తగా జీవో నెం.13 జారీ చేసిన నేపథ్యంలో, రాష్ట్రంలో 20 శాతం షూటింగ్ జరుపుకున్న చిత్రాలకే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. రాధేశ్యామ్ చిత్రీకరణ ఏపీలో జరగకపోవడంతో, టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని కోల్పోతోంది. అదనపు షోలు వేసుకునే అవకాశం ఉండదు. దాంతో కొత్త జీవో ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ల ధరలతోనే రాధేశ్యామ్ ప్రదర్శనలు ఉంటాయి. 

అయితే, రాధేశ్యామ్ చిత్రానికి తెలంగాణ సర్కారు ఊరటనిచ్చింది. రాష్ట్రంలో ఈ చిత్రం ఐదో షో వేసుకునేందుకు అనుమతి నిచ్చింది. మార్చి 11 నుంచి 25వ తేదీవరకు రాధేశ్యామ్ చిత్రాన్ని రోజుకు ఐదు షోలు వేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై రాధేశ్యామ్ నిర్మాతలు ధన్యవాదాలు తెలిపారు.

More Telugu News