ICC Womens World Cup 2022: అర్ధ సెంచరీలతో అదరగొట్టిన అమిలియా, అమీ సాటెర్త్‌వైట్.. భారత్ ఎదుట కొండంత లక్ష్యం

  • ప్రపంచకప్‌లో భారత్ రెండో మ్యాచ్
  • 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన కివీస్
  • చివర్లో బంతితో విజృంభించిన పూజా వస్త్రాకర్
  • 75 పరుగులు చేసిన అమీ సాటెర్త్‌వైట్
ICC Womens World Cup Kiwis Gives 261 Runs Target To India

భారత్‌తో జరుగుతున్న ప్రపంచకప్ పోరులో న్యూజిలాండ్ అమ్మాయిలు చెలరేగిపోయారు. టాస్ గెలిచి కివీస్‌కు బ్యాటింగ్ అప్పగించడం ఎంత తప్పో మిథాలీ సేనకు తొలి ఐదు ఓవర్లలోనే అర్థమైంది. 9 పరుగులకే న్యూజిలాండ్ తొలి వికెట్ కోల్పోయినప్పటికీ ఆ తర్వాత భారత బౌలర్లను కివీస్ బ్యాటర్లు చెడుగుడు ఆడేసుకున్నారు. వికెట్లను కాపాడుకుంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, చివర్లో మాత్రం భారత బౌలర్లు విజృంభించడంతో న్యూజిలాండ్ వడివడిగా వికెట్లు కోల్పోయి 9 వికెట్ల నష్టానికి 260 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను ముగించింది.

కెప్టెన్ సోఫీ డివైన్ (30 బంతుల్లో 7 ఫోర్లతో 35 పరుగులు) ధాటిగా ఆడగా, అమిలియా కెర్, అమీ సాటెర్త్‌వైట్ అర్ధ సెంచరీలతో చెలరేగారు. అమిలియా 64 బంతుల్లో 50 పరుగులు చేయగా, అమీ 84 బంతుల్లో 9 ఫోర్లతో 75 పరుగులు చేసింది. మేడీ గ్రీన్ 27, వికెట్ కీపర్ కేటీ మార్టిన్ 41 పరుగులు చేశారు. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ 4 వికెట్లతో విజృంభించగా, రాజేశ్వరి గైక్వాడ్ 2, జులన్ గోస్వామి, దీప్తి శర్మ చెరో వికెట్ తీసుకున్నారు.

More Telugu News