Russia: ఇక రష్యా కరెన్సీ ఒక్క పెన్నీ విలువ కూడా చేయదు: బైడెన్

  • ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిపోయింది
  • స్విఫ్ట్ ఆంక్షలతో రష్యా వాణిజ్యం దిగజారింది
  • రష్యా సైన్యమూ ఇక బలహీనమవుతుందన్న బైడెన్  
Russia Wont Value Even A Penny Says Biden

రష్యాపై ఆంక్షలు విధించడంలో ప్రపంచ దేశాలు తమతో పాటు నడిచాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ ఆంక్షల వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి బాగా దిగజారిందన్నారు. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పాతాళానికి పడిందన్నారు. ఆ దేశ కరెన్సీ రూబుల్ విలువ 50 శాతం క్షీణించిందన్నారు. ఇప్పుడు రష్యా కరెన్సీ ఒక్క పెన్నీ కూడా విలువ చేయదన్నారు. 

స్విఫ్ట్ ఆంక్షలు పెట్టడం వల్ల ఇతర దేశాలతో రష్యా వాణిజ్య సామర్థ్యం పడిపోయిందని చెప్పారు. రష్యా ముడి చమురు, గ్యాస్ ను నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్ కు అండగా ఉంటామని, నిధులు అందజేస్తామని చెప్పారు. దాని వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. 

ఆధునిక టెక్నాలజీ, సెమీకండక్టర్ల వంటి ఉత్పత్తులూ రష్యాకు అందకుండా చేస్తామని బైడెన్ హెచ్చరించారు. తద్వారా రష్యా సైన్యం బలహీనంగా మారుతుందన్నారు. అనేక అంతర్జాతీయ కంపెనీలు రష్యా నుంచి వైదొలిగాయని గుర్తు చేశారు. అమెరికా స్టాక్ ఎక్స్ చేంజ్ లు రష్యా సెక్యూరిటీల ట్రేడింగ్ ను నిలిపేశాయన్నారు. రష్యా యుద్ధాన్ని ప్రైవేట్ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయని బైడెన్ తెలిపారు.

More Telugu News