Telangana: నేను కూడా టీవీ చూస్తా!.. కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌పై కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్పంద‌న‌!

  • రేపు ఉద‌యం టీవీ చూడాల‌ని నిరుద్యోగుల‌కు కేసీఆర్ సూచ‌న‌
  • కేసీఆర్ ఏం చెబుతారోన‌న్న అంశంపై చ‌ర్చ‌
  • భువ‌న‌గిరి వెళ్లి అక్క‌డ పాలాభిషేకం చేస్తానన్న  కోమ‌టిరెడ్డి
komatireddy venkat reddy comments on kcr statement

నిరుద్యోగుల‌కు శుభ‌వార్త చెబుతాన‌ని, రేపు ఉద‌యం 10గంట‌ల‌కు టీవీ చూడండ‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. అస‌లు రేపు ఉద‌యం నిరుద్యోగుల‌కు కేసీఆర్ ఎలాంటి శుభ‌వార్త చెబుతారు? అంటూ పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. 

మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన కేసీఆర్‌పై.. కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, భువ‌న‌గిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి స్పందించారు. నిరుద్యోగ భృతి ఇస్తానంటూ నిరుద్యోగుల‌ను చాలా కాలం నుంచి కేసీఆర్ మ‌భ్య‌పెడుతున్నార‌ని, ఇప్ప‌టికైనా కేసీఆర్‌కు అదే గుర్తుకు వ‌చ్చి నిరుద్యోగ భృతి అంశంపైనే ప్ర‌క‌ట‌న చేస్తార‌న్న దిశ‌గా కోమ‌టిరెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ.. "రేపు నేను కూడా టీవీ చూస్తా. మీరు అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న చేయ‌గానే.. భువ‌న‌గిరి వెళ్లి అక్క‌డ మీకు పాలాభిషేకం చేస్తా. 2018 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో నిరుద్యోగుల‌కు రూ.3,116లు నిరుద్యోగ భృతిగా ఇస్తామ‌న్నారు. రాష్ట్రంలో 40 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులున్నారు. వారు నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నారు. 

37 నెల‌ల నిరుద్యోగ భృతి బ‌కాయిలు ఇస్తామ‌ని సీఎం ప్ర‌క‌టిస్తార‌ని ఆశిస్తున్నా. ఖాళీగా ఉన్న 1.90 ల‌క్ష‌ల ఉద్యోగాల‌కు ఒకే ద‌ఫాలో నోటిఫికేష‌న్ ఇస్తార‌ని అనుకుంటున్నా. డీఎస్సీ నోటిఫికేష‌న్ రాక చాలా మందికి వ‌యోప‌రిమితి దాటిపోయింది. అలాంటి వారికి వ‌యో ప‌రిమితి స‌డ‌లింపు ఇస్తూ నిర్ణ‌యం తీసుకుంటార‌ని భావిస్తున్నా" అని కోమ‌టిరెడ్డి వ్యాఖ్య‌లు చేశారు.

More Telugu News