LIC IPO: ఎల్ఐసీ ఐపీవో కోసం మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే..!

  • ప్రతికూలంగా మారిన పరిస్థితులు
  • దీంతో తదుపరి ఆర్థిక సంవత్సరానికి వాయిదా!
  • అధికార వర్గాల వెల్లడి
  • మరోవైపు ఎల్ఐసీ ఐపీవో రోడ్డు షోల నిర్వహణ
LIC IPO may be pushed to FY23 amid volatility

దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీవోగా నిలిచిపోనున్న ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ నెలలో సాకారమయ్యే అవకాశాలు ఏ మాత్రం కనిపించడం లేదు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంతో ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అమ్మకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలతో మన ఈక్విటీ మార్కెట్లు సైతం కుదేలవుతున్నాయి. దీంతో ఇప్పుడున్న పరిస్థితులు ఎల్ఐసీ మెగా ఐపీవోకు ప్రతికూలమని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

దీంతో ఎల్ఐసీ ఐపీవోను తదుపరి ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయవచ్చని ఈ వ్యవహారం గురించి తెలిసిన అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు సంబంధించి కేంద్ర సర్కారు రోడ్డు షోలను నిర్వహిస్తూనే ఉంది. ముందుగా నిర్ణయించినట్టు అయితే ఈ నెల రెండో వారంలో ఐపీవో చేపట్టాల్సి ఉంది. 

ఎల్ఐసీలో 10 శాతం వాటా విక్రయంతో రూ.లక్ష కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కేంద్ర సర్కారు తొలుత భావించగా.. మార్కెట్ పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత 5 శాతం విక్రయానికే పరిమితం కావాలని నిర్ణయించింది. దీంతో రూ.50,000-60,000 కోట్ల వరకు సమీకరించాలనుకుంది. ఇప్పుడు వాయిదా వేసేట్టు అయితే.. తదుపరి ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వాటా విక్రయానికి మొగ్గు చూపిస్తుందేమో చూడాలి.

More Telugu News