Boris Johnson: పుతిన్ ఒక యుద్ధ నేరస్థుడు: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్ర వ్యాఖ్యలు

  • ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ యత్నాలు
  • అవి కచ్చితంగా యుద్ధ నేరాలన్న జాన్సన్
  • అమాయక ప్రజలపై బాంబులు వేస్తున్నారని మండిపాటు  
Boris Johnson describes Putin a War Criminal

ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్న ఆరోపణలపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ప్రాసిక్యూటర్ దర్యాప్తుకు సిద్ధమైన వేళ, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్రస్థాయిలో స్పందించారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను ఒక యుద్ధ నేరస్థుడిగా పేర్కొన్నారు. పుతిన్ నాయకత్వంలోని రష్యా... ఉక్రెయిన్ లో ఇప్పటికే పలు యుద్ధ నేరాలకు పాల్పడిందని ఆరోపించారు. అమాయక పౌరులపై బాంబులు వేస్తున్నారని మండిపడ్డారు. 

రష్యా యుద్ధ నేరాలపై అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం దర్యాప్తుకు అన్ని బ్రిటన్ చట్టసభల సభ్యులందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. "ఉక్రెయిన్ లో రష్యా ముమ్మాటికీ యుద్ధ నేరాలకు పాల్పడింది. పుతిన్ నేరాలను అందరూ చూశారు. అవి కచ్చితంగా యుద్ధ నేరాలే అవుతాయి. క్రిమినల్ న్యాయస్థానం ప్రాసిక్యూటర్ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి ఉంటారు. బ్రిటన్ రాజకీయ పక్షాలన్నీ మద్దతిస్తాయని భావిస్తున్నాను" అని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు.

More Telugu News