Prabhas: ప్రభాస్ 'రాధేశ్యామ్' థియేట్రికల్ ట్రైలర్ ఇదిగో!

  • ప్రభాస్ అభిమానులకు కానుక
  • సంబరాలకు తెర లేచిందన్న చిత్రయూనిట్
  • మార్చి 11న వస్తున్న రాధేశ్యామ్
  • థ్రిల్ కు గురిచేసే అంశాలతో ట్రైలర్
Prabhas Radhe Shyam theatrical trailer released

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ విలక్షణ కథా చిత్రం రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రిలీజ్ కు ముందు అభిమానుల సంబరాలకు తాజా ట్రైలర్ తో తెర లేచింది. ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రికా నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు థ్రిల్ కు గురిచేసే అనేక అంశాలు ఇందులో ఉన్నాయని ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.

More Telugu News