Sebastian PC 524: కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పీసీ 524' ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు

  • కిరణ్ అబ్బవరం హీరోగా 'సెబాస్టియన్ పీసీ 524'
  • ఈ నెల 28న థియేట్రికల్ ట్రైలర్
  • రేపు ట్రైలర్ గ్లింప్స్ వీడియో
  • మార్చి 4న సినిమా విడుదల
Kiran Abbavaram Sebastian trailer to be released

యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 28న ఉదయం 11.04 గంటలకు విడుదల కానుంది. కాగా, ఈ ట్రైలర్ కు సంబంధించిన గ్లింప్స్ వీడియో రేపు ఉదయం 11.04 గంటలకు రిలీజ్ చేయనున్నారు. కాగా, 'సెబాస్టియన్ పీసీ 524' చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. జోవిత సినిమాస్, ఎలైట్ గ్రూప్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రానికి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. ఇందులో కిరణ్ అబ్బవరం సరసన కోమలి ప్రసాద్, నువేక్ష నటించారు. జిబ్రాన్ సంగీతం అందించాడు.

More Telugu News