Pavan kalyan: 'భీమ్లా నాయక్' కష్టమైన కథ: త్రివిక్రమ్

  • మూలకథ చాలా గొప్పది 
  • పాత్రలను బ్యాలెన్స్ చేయడం కష్టమైంది 
  • కోవిడ్ సమయంలోను పవన్ పనిచేశారు 
  • తమన్ పాటలు గొప్పగా ఉన్నాయన్న త్రివిక్రమ్  
Bheemla Nayak Success Meet

పవన్ - రానా కాంబినేషన్లో రూపొందిన 'భీమ్లా నాయక్' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. తొలి ఆటతోనే సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో, ఈ సినిమా టీమ్ కొంతసేపటి క్రితం సక్సెస్ ప్రెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే సమకూర్చిన త్రివిక్రమ్ ఈ వేదికపై మాట్లాడారు.
 
మలయాళంలో వచ్చిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి 'భీమ్లా నాయక్' రీమేక్. ఒరిజినల్ కథ చాలా గొప్పది. తెలుగు నేటివిటీకి తగినట్టుగా పవన్ .. రానా పాత్రలను బ్యాలెన్స్ చేయడానికి మేము చాలా కష్టపడవలసి వచ్చింది. ఇద్దరి భార్యల పాత్రల విషయంలోను అదే పద్ధతిని పాటిస్తూ వచ్చాము. అందరూ కూడా మేము చెప్పినదానికంటే బాగా చేశారు.

గణేశ్ మాస్టర్ 600 మందితో డాన్స్ కంపోజ్ చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. తమన్ పాటలు ఈ సినిమా విజయంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. పవన్ .. రానా ఇద్దరూ కూడా కోవిడ్ సమయంలో బయటికి వచ్చి జనంతో కలిసి పనిచేయడం విశేషం. ఈ సినిమాతో జానపద కళాకారులకు పేరు రావడం సంతోషంగా ఉంది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News