KTR: సిరిసిల్ల‌కు భారీ పెట్టుబ‌డి.. అపారెల్ పార్కులో టెక్స్‌పోర్ట్ యూనిట్‌

  • 7.42 ఎకరాల విస్తీర్ణంలో టెక్స్‌పోర్ట్ కంపెనీ యూనిట్‌
  • 2 వేల మందికి ఉపాధి ల‌భించే అవ‌కాశం
  • కేటీఆర్ స‌మ‌క్షంలో జరిగిన ఒప్పందం 
Texport Company Unit at Siricilla Apparel Park

ప‌రిశ్ర‌మ‌ల‌ను ఆకర్షించే విష‌యంలో తెలంగాణ స‌ర్కారు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. పెట్టుబ‌డిదారుల డెస్టినేష‌న్‌గా మారిపోయిన తెలంగాణ‌లో ఇప్ప‌టికే ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీలు త‌మ యూనిట్ల‌ను నెల‌కొల్పాయి. తాజాగా బెంగ‌ళూరుకు చెందిన టెక్స్‌పోర్ట్ కంపెనీ త‌న వ‌స్త్ర త‌యారీ యూనిట్‌ను తెలంగాణ‌లో నెల‌కొల్పేందుకు ముందుకు వ‌చ్చింది. ఈ మేర‌కు శుక్ర‌వారం తెలంగాణ మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టెక్స్‌పోర్ట్ కంపెనీ ఎండీ న‌రేంద్ర గోయెంకా తెలంగాణ ప్ర‌భుత్వంతో ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఈ ఒప్పందం ప్ర‌కారం సిరిసిల్ల ప‌రిధిలోని పెద్దూరులో తెలంగాణ స‌ర్కారు ఏర్పాటు చేస్తున్న అపారెల్ పార్కులో టెక్స్‌పోర్ట్ కంపెనీ త‌న యూనిట్‌ను నెల‌కొల్ప‌నుంది. పెద్దూరు స‌మీపంలో మొత్తం 63 ఎక‌రాల విస్తీర్ణంలో రూ.175 కోట్ల వ్య‌యంతో తెలంగాణ ప్ర‌భుత్వం అపారెల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బిల్ట్ టూ సూట్ పధ్ధతిలో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు కానున్న ఈ పార్కులో 7.42 ఎక‌రాల విస్తీర్ణంలో టెక్స్‌పోర్ట్ కంపెనీ త‌న యూనిట్‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఈ యూనిట్ ద్వారా సిరిసిల్ల‌కు చెందిన దాదాపు 2 వేల మందికి ఉపాధి ల‌భించ‌నుంద‌ని తెలంగాణ చేనేత‌, జౌళి శాఖ కార్య‌ద‌ర్శి శైల‌జా రామ‌య్య‌ర్ తెలిపారు.

More Telugu News