Ukraine: ర‌ష్యాపై అమెరికా సైబ‌ర్ అటాక్

  • ర‌ష్యాను ఇదివ‌ర‌కే హెచ్చరించిన అమెరికా
  • అమెరికా హెచ్చ‌రిక‌ల‌ను బేఖాత‌రు చేసిన ర‌ష్యా
  • అమెరికా దాడుల‌తో ర‌ష్యా డిఫెన్స్ సైట్ డౌన్‌
america cyber attacks on russia

ర‌ష్యా, ఉక్రెయిన్ల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధంలో శుక్ర‌వారం మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఆది నుంచి ర‌ష్యా వైఖ‌రిని ఖండిస్తూ వ‌చ్చిన అగ్ర‌రాజ్యం అమెరికా శుక్ర‌వారం కీల‌క అడుగు వేసింది. ర‌ష్యా ఊహించ‌ని విధంగా ఆ దేశంపై అమెరికా సైబ‌ర్ అటాక్‌కు దిగింది. ఇందులో భాగంగా ర‌ష్యా డిఫెన్స్ సైట్‌ను అమెరికా డౌన్ చేసేసింది. ఉక్రెయిన్‌తో విభేదాల ప‌రిష్కారానికి అంత‌ర్జాతీయ స‌మాజం చేస్తున్న విన‌తుల‌ను పెడ‌చెవిన‌పెడితే.. ర‌ష్యాపై సైబ‌ర్ దాడుల‌కు పాల్పడుతామ‌ని ఇదివ‌ర‌కే అమెరికా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అమెరికా, నాటో స‌హా ప‌లు ఇత‌ర దేశాలు చేసిన విన‌తుల‌ను ఏమాత్రం లెక్క‌చేయ‌ని ర‌ష్యా.. ఉక్రెయిన్‌పై గురువారం నుంచే యుద్ధం మొద‌లెట్టేసింది. ర‌ష్యా భీక‌ర‌దాడుల‌తో ఉక్రెయిన్ చిగురుటాకులా వ‌ణికిపోతోంది. అయిన‌ప్ప‌టికీ ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా వీల‌యినంత మేర ర‌ష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైన్యం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇలాంటి త‌రుణంలో ర‌ష్యాకు షాకిస్తూ అమెరికా కీల‌క అడుగు వేసింది. ర‌ష్యాపై సైబ‌ర్ దాడుల‌కు దిగిన అమెరికా మున్ముందు మ‌రే క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకుంటుందోన‌న్న అంశంపై ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

More Telugu News