Prabhas: భారీ ఈవెంట్ కి రెడీ అవుతున్న 'రాధేశ్యామ్'

  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'రాధేశ్యామ్'
  • ప్రభాస్ సరసన పూజ హెగ్డే
  • వచ్చేనెల ఫస్టు వీక్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్
  • వచ్చే నెల 11వ తేదీన సినిమా రిలీజ్  
Radhe Shyam movie update

ప్రభాస్ - పూజ హెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' సినిమాకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ .. టి సిరీస్ వారు నిర్మించిన ఈ సినిమాను మార్చి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది.

వచ్చేనెల మొదటివారంలో భారీస్థాయిలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్నప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మళ్లీ అదే స్థాయిలో ఈ వేడుకను జరపనున్నారని అంటున్నారు.

ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ రోజున 'ఈ రాతలే .. ' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. పూర్తి పాటను రేపు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో కృష్ణంరాజు .. భాగ్యశ్రీ .. జగపతిబాబు .. సత్యరాజ్ కీలకమైన పాత్రలను పోషించారు.

More Telugu News