Pavan Kalyan: త్రివిక్రమ్ లేకపోతే 'భీమ్లా నాయక్' లేదు: పవన్

  • ఈ నెల 25వ తేదీన 'భీమ్లా నాయక్' రిలీజ్ 
  • నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు 
  • త్రివిక్రమ్ పై ప్రశంసలు కురిపించిన పవన్   
Bheemla Nayak movie update

పవన్ హీరోగా సాగర్ కె చంద్ర 'భీమ్లా నాయక్' సినిమాను రూపొందించాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి, త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందించారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వస్తోంది. హైదరాబాద్ .. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.

ఈ వేదికపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. "ఇది 'అయ్యప్పనుమ్ కోషియుమ్' అనే మలయాళ సినిమాకి రీమేక్. ఇక పోలీస్ ఆఫీసర్ కీ .. రాజకీయంగా ఎదగాలనుకునే ఒక వ్యక్తికి మధ్య జరిగే కథ. అహంకారానికీ .. ఆత్మాభిమానానికి మధ్య జరిగే యుద్ధం. ఈ సినిమాకి త్రివిక్రమ్ వెన్నెముకలా నిలిచారు. మూలాధారం నుంచి సహస్రారం వరకూ అంతా ఆయనే. త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా లేదు.

రానాతో పాటు అంతా కూడా ఎవరి పాత్రలను వారు అద్భుతంగా పోషించారు. సితార వారు అనుకూలంగా షెడ్యూల్స్ వేయిస్తూ నాకు ఎంతో మద్దతును ఇచ్చారు. నా సినిమాలను ఆదరించమని అడిగే అలవాటు నాకు లేదు. ఈ సినిమా మీకు ఆనందాన్ని కలిగిస్తే అదే నాకు సంతోషం" అని చెప్పుకొచ్చారు.

More Telugu News