Telangana: వెయ్యి రూపాయలు కడితే భూమి క్రమబద్దీకరణ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణకు కొత్త మార్గదర్శకాలు
  • 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ
  • 2014 జూన్ 2కు ముందునుంచి ఉంటున్నట్టు ధ్రువీకరణపత్రం చూపించాలి
Free land regualtion upto 120 sqy in Telangana

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. గతంలో జారీ చేసిన జీవోలు 58, 59 ను కొనసాగిస్తున్నట్టు తెలిపింది. జీవో 59 కింద వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకుంటే 125 గజాల వరకు ఉచితంగా ప్రభుత్వం క్రమబద్ధీకరించనుంది. ఆస్తి విలువలో 12.5 శాతాన్ని చెల్లించే నిబంధనను తొలగించింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలకు 125 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. అంతకు మించి భూమి ఉంటే రిజిస్ట్రేషన్ ధరలకు అనుగుణంగా వసూలు చేస్తారు.

భూమిని క్రమబద్ధీకరించుకోవడానికి ఆధార్‌ కార్డు, ఆక్రమిత స్థలంలో 2014 జూన్ 2కు ముందు నుంచి ఉంటున్నట్టు ధ్రువీకరణ పత్రం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా ప్రాపర్టీ ట్యాక్స్ రసీదు, విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు, నివాస ధ్రువీకరణ పత్రం తదితర పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైనా కట్టిన వెయ్యి రూపాయలను వెనక్కి ఇవ్వరు.

More Telugu News