Ajith: హైదరాబాదులో 'వలిమై' ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • అజిత్ హీరోగా రూపొందిన 'వలిమై'
  • యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో సాగే కథ
  • ప్రతినాయకుడిగా కార్తికేయ
  • ఈ నెల 24వ తేదీన భారీ విడుదల  
valimai movie update

అజిత్ హీరోగా వినోద్ దర్శకత్వంలో 'వలిమై' సినిమా రూపొందింది. బోనీ కపూర్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను, తమిళంతో పాటు ఇతర భాషల్లోను ఈ నెల 24వ తేదీన విడుదల చేయనున్నారు. హుమా ఖురేషి కథానాయికగా నటించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కార్తికేయ కనిపించనున్నాడు.

తమిళనాట ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో జరుగుతున్నాయి. ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక్కడ మాత్రం ఎలాంటి హడావిడి లేకపోవడం పట్ల సోషల్ మీడియా ద్వారా అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితమే వదిలారు. హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్స్ తో వదిలిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది. 'భీమ్లా నాయక్'కి ఒక రోజు ముందు రంగంలోకి దిగుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి..

More Telugu News