Chiranjeevi: మాఫియా డాన్ పాత్రలో మెగాస్టార్!

  • వరుస ప్రాజెక్టులతో చిరూ
  • ముగింపు దశలో 'గాడ్ ఫాదర్'
  • సెట్స్ పైనే మరో రెండు సినిమాలు
  • వెంకీ కుడుముల స్క్ట్రిప్ ఫైనల్  
Chiranjeevi in Venky Kudumula Movie

దర్శకుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తూనే వెంకీ కుడుముల భారీ విజయాలను అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'ఛలో' .. 'భీష్మ' సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ తరువాత ప్రాజెక్టును ఆయన చిరంజీవితోనే చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంలో చాలామందిలో సందేహం తలెత్తింది.

నిజంగానే వెంకీ కుడుములతో సినిమా చేయడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వెంకీ కుడుముల స్క్రిప్ట్ వినిపించగానే ఆయన ఓకే చెప్పడం జరిగిపోయిందని అంటున్నారు. చిరంజీవి 'మాఫియా డాన్' గా కనిపించనున్న ఈ సినిమాను, డీవీవీ దానయ్య నిర్మిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమాను విడుదల చేయాలనేది ప్లాన్.

ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న 'గాడ్ ఫాదర్' ముగింపు దశకి చేరుకుంది. ఆ తరువాత 'భోళాశంకర్' .. 'వాల్తేరు వీర్రాజు' సినిమాలు పూర్తిచేయనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు షూటింగు పార్టు కంప్లీట్ చేసిన తరువాత ఆయన వెంకీ కుడుములతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది.

More Telugu News